Param Veer Names for Andaman Nicobar islands: అండమాన్ దీవులకు పరమ్ వీర్ పేర్లు
Param Veer Names for Andaman Nicobar islands: అండమాన్ నికోబార్ దీవులపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అండమాన్ నికోబార్‌లోని 21 దీవులకు పరమ్ వీర్ చక్ర అవార్డులు పొందినవారి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ విధంగా వారికి సముచిత గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుందని, దేశానికి సేవ చేసిన వారికి, దేశం కోసం పోరాటం చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే అండమాన్ నికోబార్‌లోని 21 దీవులకు పరమ్ వీర చక్ర అవార్డులు పొందిన వారి పేర్లను పెట్టారు.
ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెమోరియల్‌ను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యంకోసం పోరాటం చేసిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిరస్మరణీయుడు. ఆయన ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసి తెల్లదొరలపై పోరాటం చేశారు. 10943లో తొలిసారిగా అండమాన్ గడ్డపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని ప్రధాని కొనియాడారు. నేతాజీ మెమోరియల్‌ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. అండమాన్ నికోబార్ దీవులను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే నేతాజీ మెమోరియల్‌ను ఏర్పాటు చేసింది.