India Corona: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి
India Corona TOday Update: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3 లక్షల 91 వేల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 19 వేల 406 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్‌తో నిన్న ఒక్క రోజే 49 మంది మరణించారని తెలిపారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.96 శాతానికి చేరినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో అత్యధికంగా 2 వేల 419 మంది ఈ మహమ్మారి భారిన పడ్డట్లు వైద్యాధికారులు తెలిపారు.
మరోవైపు శుక్రవారం కరోనాతో 19 వేల 928 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్ష 34 వేలుగా ఉండగా.. క్రియాశీల రేటు 0.3 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.50 శాతంగా నమోదైంది. దేశంలో వ్యాక్సినెషన్ డ్రైవ్ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 32 లక్షల 7 వేల మంది టీకా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకూ 205 కోట్లకు పైగా కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య అధికారులు పేర్కొన్నారు.