Naveen patnaik: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ముగిశాయి. ఇక ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా ఈ ఏడాది చివరలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న ఎన్నికల (Elections) పైనే ఉంది.
Naveen patnaik: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) ముగిశాయి. ఇక ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా ఈ ఏడాది చివరలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న ఎన్నికల (Elections) పైనే ఉంది. ఇప్పటి నుంచే పలువురు నేతలు ఎన్నికలకు సంబంధించి దివ్యాస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen patnaik) ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఈ ఏడాది చివర్లో ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ ఏడాది చివరలో ఆయా రాష్ట్రల్లో జరగనున్న ఎన్నికలతో తాము కూడా వెళ్లాలని పట్నాయక్ సన్నాహాలు చేస్తున్నారు.
వాస్తవానికి వచ్చే ఏడాది మే వరకు పట్నాయక్ సర్కార్‌కు సమయం ఉంది. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే తమ ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పట్నాయక్ ఆలోచిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైతే.. లోక్‌సభ సభ్యుల కోసం పనిచేయడం కుదరదని భావిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి తన ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని ఆశిస్తున్నారు. అందుకోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు నవీన్ పట్నాయక్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి,
ఇకపోతే ఒడిశాలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ మొత్తం 147 స్థానాలకు గానూ.. 112 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 23, కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి. అదే సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 21 స్థానాలకు గానూ.. బీజేడీ 13 సీట్లు, బీజేపీ 8 సీట్లను దక్కించుకుంది.