Odisha CM: ఒడిషా ప్రభుత్వం చేపట్టిన మార్పులు సత్ఫలితాలను ఇచ్చాయా?
Odisha CM expressed Satisfaction about the Position of Odisha schools in ASER report
దేశంలో విద్యాప్రమాణ స్థితిగతులపై వెలువడిన విద్యా సర్వే నివేదికపై ఒడిసా సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిషా స్కూల్ ట్రాన్ఫర్మేషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో చేపట్టిన పలు చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయని సీఎం నవీన్ పట్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు.
విద్యా విధానంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్దుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సీఎం తెలిపారు. 2018లో 88 శాతంగా ఉన్న విద్యార్ధుల చేరికలు 2022 నాటికి 92.1 శాతానికి పెరిగింది.
2018లో విద్యాలయాల్లో ఉన్న టాయిలెట్ల సంఖ్య 75.7 శాతంగా ఉండేది. గత నాలుగేళ్లలో ఆ సంఖ్య మరింతగా పెరిగింది. ప్రభుత్వం కేటాయించిన నిధుల కారణంగా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. టయిలెట్ల సంఖ్య 82.1 శాతానికి పెరిగాయి. ఒడిషా రాష్ట్రంలోని ఉన్న మొత్తం పాఠశాలల్లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 2018లో ఆ సంఖ్య 69.1 శాతంగా ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 76.5 శాతానికి పెరిగింది.
ఒడిషా రాష్ట్రంలోని పాఠశాలలో ఉన్న విద్యుత్ సౌకర్యం గణనీయంగా పెరిగింది. 2018లో కేవలం 56.5 శాతం ఉన్న విద్యుత్ సౌకర్యం గత నాలుగేళ్లలో విపరీతంగా పెరిగింది. 93.7 శాతానికి పెరిగింది. ప్రభుత్వం సరైన సమయంలో నిధులు మంజూరు చేయడంతో సౌకర్యాల కల్పన శరవేగంగా జరిగింది. దీంతో విద్యాప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
Among other improved parameters, useable toilets in #Odisha schools rose from 75.7% in 2018 to 82.1% in 2022. Provision of separate useable toilets for girls increased from 69.1% in 2018 to 76.5% in 2022. Electricity connection extended to 93.7% schools now against 56.5% in 2018. pic.twitter.com/qOmtifrKSS
— CMO Odisha (@CMO_Odisha) January 19, 2023