Nupur Sharma: నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు చేసిన ఢిల్లీ పోలీసులు
Nupur Sharma was given gun license
బీజేపీ నేత నుపుర్ శర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. గన్ లైసెన్స్ పొందారు. తన ప్రాణాలకు హాని ఉందని ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకు లైసెన్స్ అనుమతించారు.
కొన్నినెలల క్రితం మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశ వ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొన్నారు. అనేక మంది నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఆమెపై నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి.
ఒక టీవీ ఛానెల్ లో జరిగిన డిబేట్ సమయంలో వాదోపవాదనలు జరిగాయి. ఆ సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఆమెను చాలా మంది టార్గెట్ చేశారు. ఆమెపై దాడికి ప్రయత్నించారు.నుపుర్ కు ప్రాణాపాయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. గన్ లైసెన్స్ పొందారు.