NRI Employees struggle with layoffs: భారతీయ టెకీలకు ఐటీ కష్టాలు
NRI Employees struggle with layoffs: ఆర్థిక మాంద్యం దెబ్బకు ప్రపంచ దేశాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచంలోని టాప్ కంపెనీలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను పక్కన పెట్టాయి. ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లిన వారు లే ఆఫ్ కారణంగా ఉద్యోగాలు పొగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. హెచ్1బీ వీసాలపై వందలాది మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. గత నవంబర్ నెల నుంబి సుమారు 2 లక్షల మందిని ఉద్యోగాల్లో నుండి తొలగించారు. ఇందులో 40 శాతం మంది భారతీయ టెకీలే ఉన్నారు. దీంతో వీరంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు.
హెచ్1బీ వీసా కావడంతో రాబోయే ఆరు నెలల కాలంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. లేదంటే వీరంతా ఇంటిబాట పట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భణం భయంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. అమెజాన్ 20 వేల మందిని తొలగించగా, మైక్రోసాఫ్ట్ సంస్థ 12 వేల మందిని, గూగుల్ 10 వేల మందిని తొలగించింది. ఇక ట్విట్టర్ వేలాది మందిని పక్కన పెట్టింది. వీటితో పాటు పలు కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించుకొని భారం తగ్గించుకుంటున్నాయి. ఈ మాంద్యం ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి.