విపక్షాలను ఏకం చేసే పనిలో నితీశ్ కుమార్ చాలా పట్టుదల కనబరుస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దూరం చేయాలనే గట్టి సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అనేక మంది పార్టీ అధినేతలతో మంతనాలు జరిపారు. తాజాగా మరోసారి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పడ్డారు
Nitish kumar is trying to united Non BJP leaders ahead of Lok Sabha Elections
విపక్షాలను ఏకం చేసే పనిలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ చాలా పట్టుదల కనబరుస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దూరం చేయాలనే గట్టి సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అనేక మంది పార్టీ అధినేతలతో మంతనాలు జరిపారు. తాజాగా మరోసారి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పడ్డారు. నిన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసిన నితీశ్ కుమార్, ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీలను కలిశారు. కీలక విషయాలను చర్చించారు.
పాట్నాలో త్వరలోనే విపక్షాల ఐక్య సదస్సు నిర్వహించే ఆలోచనలో నితీశ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సదస్సు నిర్వహించే విషయంలో వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని వారిని ఆహ్వానించే పనిలో నితీశ్ కుమార్ నిమగ్నమయ్యారు.
గత నెల 24వ తేదీన బెంగాల్ సీఎం మమత బెనర్జీని కలిసిన నితీశ్ కుమార్ మరోసారి ఆమెతో భేటీ కానున్నారు. మమత బెనర్జీ ఇచ్చిన సలహా మేరకు పాట్నాలో విపక్షాల సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన నితీశ్ కుమార్ సరైన తేదీ ఖరారు చేసే పనిలో ఉన్నారు.
నిన్న ఢిల్లీ వెళ్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమైన నితీశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంటే కేంద్రం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఇటువంటి సమయంలో దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని నితీశ్ కుమార్ కోరారు.
Shri Nitish Kumar ji meets with Congress president Shri Mallikarjun Kharge ji and Rahul Gandhi in New Delhi.
Nitish Kumar | @INCIndia | @NitishKumar | @kharge | @RahulGandhi pic.twitter.com/JTZRTkhy1T
— INC News (@TheIncNews) May 22, 2023
Shri Nitish Kumar ji meets with Congress president Shri Mallikarjun Kharge ji and Rahul Gandhi in New Delhi.pic.twitter.com/cm5q3Nv3kV
— Surbhi (@SurrbhiM) May 22, 2023