Niti Aayog: పేడ ఆధారిత సేంద్రియ ఎరువులకు ప్రోత్సాహం.. నీతి ఆయోగ్
Niti Aayog: ఒక్కపుడు వ్యవసాయం అంటే సేంద్రియ ఎరువులతో మాత్రమే చేసేవారు..కానీ రాను రాను ఈ పద్దతి మారిపోయి పల్లెటూళ్లలోకి రసాయన మందులు ఎంటరై వ్యవసాయదారులు తమవైపు తిప్పుకున్నాయి. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా కలుషితమైపోయింది. రసాయనాలతో పండించేపంట చేసే మేలుకంటే నష్టమే ఎక్కువని ఎంతోమంది శాస్తవేత్తలు తెలిపిన పెడచెవిన పెడుతున్నారు.
అత్యధిక ఇంధనాలను వాడి ఫ్యాక్టరీలలో తయారు చేసే రసాయన ఎరువులు, విష పూరిత రసాయన కీటక నాశనులు ఇప్పటికే పర్యావరణంపై, అన్ని జీవ జాతుల ఆరోగ్యంపై చూపిస్తున్న దుష్ప్రభావాలను మనం అనుభవిస్తున్నాం. ఇందుకు నీతిఆయోగ్ ఓ కమిటీని వేసింది. గోశాలలకు ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్ కమిటీ ఒకటి సిఫార్సు చేసింది. గోశాలలకు పెట్టుబడి రూపంలో సాయం చేయాలని, పేడ, గోమూత్రాలతో చేసిన పదార్థాలను వ్యవసాయానికి ఉపయోగించేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపింది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన టాస్క్‌ఫోర్స్ శుక్రవారం అందజేసిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. గోశాలల పెట్టుబడులు, నిర్వహణ కోసం ఉదారంగా ఆర్థిక సాయం చేయాలని, రాయితీపై వడ్డీలు ఇవ్వాలని తెలిపింది. గోశాలల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం పోర్టల్‌ను రూపొందించాలని కూడా సూచన చేసింది.