Niti Aayog: ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం ప్రారంభమయింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
Niti Aayog: ఢిల్లీలో నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం ప్రారంభమయింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ముందుగా నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి వచ్చిన ప్రతినిధులతో మోడీ గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత ప్రారంభోపన్యాసం చేశారు.
ఇక కార్యక్రమంలో వికసిత్ భారత్ @2047, ఎంఎస్ఎంఈఎస్లపై నమ్మకం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మహిళా సాధికారత, సమస్యలు తగ్గించడం, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధాని మోడీ సాయంత్రం 5 గంటలకు ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత 6 గంటలకు సమావేశం ముగియనుంది.
ఈ సమావేశానికి తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, డీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరు కాలేదు. కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై విపక్ష నేతలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో విపక్ష నేతలంతా నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరు కాలేదు.