NIA: ఉగ్రవాదానికి నిధులు (Terror Funding Case) సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National investigation agency) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా సోమవారం కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో ఎన్ఐఏ (NIA) అధికారులు దాడులు చేశారు.
NIA: ఉగ్రవాదానికి నిధులు (Terror Funding Case) సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (National investigation agency) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా సోమవారం కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పుల్వామా, షోపియాన్ ప్రాంతాల్లో ఎన్ఐఏ (NIA) అధికారులు దాడులు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా కాన్సిపోరాకు చెందిన అబ్దుల్ ఖలిక్, సంగ్రికి చెందిన షోయబ్ అహ్మద్ చూర్, జావిద్ అహ్మద్ ధోబి ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేశారు.
పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండర్ల ఆదేశాల మేరకు నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను ఛేదించేందుకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 20న పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఎన్ఐఏ చర్యలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వారిని గుర్తించేందుకు ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.