New Parliament Building: జనవరి 31న కొత్త పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి ప్రసంగం!
New Parliament Building: భారత కొత్త పార్లమెంటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌ల పనులు చివరి దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లోక్‌సభ, రాజ్యసభ కొత్త ఛాంబర్‌లో ఎంపీలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపనుల వేగాన్ని పరిశీలిస్తే, ఈ ఏడాది 2023-24 బడ్జెట్‌ను కూడా కొత్త పార్లమెంట్ హౌస్‌లో సమర్పించవచ్చని అంచనాలు ఉన్నాయి. పాత పార్లమెంట్ భవనానికి ఎదురుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పార్లమెంట్లో 1,000 మందికి పైగా ఎంపీలకు సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఇక అందుతున్న సమాచారం మేరకు పార్లమెంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
ఈ పనులు కూడా జనవరి నెలాఖరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఎంపీలు కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు కొత్త ఐడీ కార్డులను తయారు చేసే పనిని లోక్‌సభ ఇప్పటికే ప్రారంభించిందని అంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 31 జనవరి 2023న కొత్త లోక్‌సభ హౌస్ నుండి జాయింట్ సెషన్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఫిబ్రవరి 1, 2023న కొత్త లోక్‌సభ హౌస్ నుండి ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారని అంటున్నారు. కొత్త పార్లమెంట్ హౌస్ నవంబర్ 2022 నాటికి సిద్ధం కావాల్సి ఉంది, అయితే దాని పనిలో ఇప్పటికే చాలా జాప్యం జరిగింది.