Supreme court: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవన (New Parliament Building) ప్రారంభోత్సవం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి (President) కాకుండా ప్రధాని మోడీ (PM modi) ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
Supreme court: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవన (New Parliament Building) ప్రారంభోత్సవం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి (President) కాకుండా ప్రధాని మోడీ (PM modi) ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 19 పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. కేంద్రం తీరుపై భగ్గుమంటున్నాయి. రాష్ట్రపతి చేత ప్రారంభించకపోవడం.. ప్రారంభోత్సవ వేడుకకు వారిని ఆహ్వానించకపోవడం రాష్ట్రపతిని అవమానించినట్లే అవుతుందని మండిపడ్డాయి.
ఈక్రమంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని భాతర రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలయింది. న్యాయవాది జయ సుఖిన్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. లోక్ సభ సెక్రటేరియట్ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని జయ సుఖిన్ పిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది.
ఇక పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ లోక్సభ సచివాలయ కార్యదర్శి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించారు. అయితే 19 పార్టీలు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాయి. ముందుగా టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత టీఎంసీతో సహా మొత్తం 19 పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.