మే 3వ తేదీ నుంచి మణిపూర్ అట్టుడుకుతోంది. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం పోలీసులు, భద్రతా బలగాల నిఘాలో ఉంది. ఎక్కడా మళ్లీ అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. మణిపూర్‌లో హింసను నియంత్రించే ఉద్దేశంతో.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన చేస్తున్నారు.
Manipur: మే 3వ తేదీ నుంచి మణిపూర్ అట్టుడుకుతోంది. గిరిజన, గిరిజనేతర వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రం పోలీసులు, భద్రతా బలగాల నిఘాలో ఉంది. ఎక్కడా మళ్లీ అల్లర్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. మణిపూర్‌లో హింసను నియంత్రించే ఉద్దేశంతో.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన చేస్తున్నారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్ నేతృత్వంలో పీస్ కమిటీ ఉంటుందన్నారు. అల్లర్లలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు 8 డాక్టర్ల బృందం ప్రస్తుతం మణిపూర్‌లో ఉన్నారు. ఖోంగ్సాంగ్ రైల్వే స్టేషన్ వద్ద తాత్కాలిక ప్లాట్‌ఫామ్‌ను వేగంగా నిర్మిస్తున్నామని, దీన్ని వారంలోగా ఆపరేషన్ స్థాయికి తీసుకువస్తామన్నారు. మణిపూర్‌కు కొత్త డీజీపీగా రాజీవ్ సింగ్‌ను నియమించారు. ఆ రాష్ట్ర పోలీసుశాఖ చీఫ్‌గా ఇక ఆయన కొనసాగనున్నారు. హింసను అదుపుచేసేందుకు చర్యల చేపట్టనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జీతో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న డీజీపీ డౌంగెల్ ను బదిలీ చేసింది.ఆ స్థానంలో 1993 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ సింగ్ ను డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల అక్కడ పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా భవిష్యత్ లో ఇలాంటి హింస జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు మణిపూర్‌లో జరిగిన వర్గ హింసలో దాదాపు 50 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాల్లోని అర్హులైన వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగమూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు . అంతే కాదు రాష్ట్రంలో బాధితులెవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులనూ పంపిణీ చేయాలని ఆదేశించారు.