Covid Cases in India: చాపకింద నీరుగా కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా 20,409 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 4 కోట్ల 40 లక్షలకు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. వాటి సంఖ్య1,43,988కి పడిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 47 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,26, 258కి చేరింది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.5కి చేరింది. మొత్తం కేసుల్లో 0.9 శాతం కేసులు మాత్రమే యాక్టివ్ కేసులుగా ఉన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. అక్కడ 116 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఆ జిల్లాలో 7,33,893కి చేరింది. యాక్టివ్ కేసులు 809కి చేరాయి.
ఒడిషాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్ 13,11,135కి చేరింది. ఒడిషాలోని సుందర్ఘర్ జిల్లాలో 259 కేసులు, ఖోర్డాలో 158 కేసులు కొత్తగా వెలుగుచూశాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6787కి చేరింది,
న్యూఢిల్లీలో కొత్తగా 1128 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 19,51,930కి చేరింది. కోవిడ్ మరణాలు 26 వేలకు పైనే ఉన్నాయి.
విదేశాల్లో విజృంభణ
కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. జపాన్ దేశంలో తీవ్ర రూపం దాల్చింది. ఒక్క రోజులో 2,07,236 కొత్త కేసులు నమోదయ్యాయి. 122 మంది కరోనా కాటుకు బలయ్యారు. అదే విధంగా అమెరికాలో కూడా కరోనా వైరస్ తీర రూపం దాల్చింది. అక్కడ 93,216 కొత్త కేసులను అధికారులు గుర్తించారు. 260 మంది ప్రాణాలు కోల్పోయారు.