NEET UG 2023: నీట్ యూజీ నోటిఫికేషన్ విడుదల
NEET UG 2023 దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ యూజీ పరీక్షను మే 7న నిర్వహించనున్నట్లు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో వెల్లడించనున్నారు. గతేడాది 17.64 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18లక్షల మంది రాసే అవకాశం ఉందని తెలుస్తుంది. విదేశాల్లో ఎంబీబీస్ పూర్తిచేసి ఇండియాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యే భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు కూడా నీట్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి. 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ ,ఎస్టీ,ఓబీసీ, దివ్యాంగుల అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయో సడలింపు ఉంది. మిగతా అభ్యర్థుల గరిష్థ వయసు 25 సంవత్సరాలకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 06.04.2023 గా నిర్దారించింది.