Indian Navy: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ వగీర్
Indian Navy: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం చేరుకుంది. కల్వరి క్లాస్ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్‌ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ హాజరయ్యారు. అయన సమక్షంలో ఐఎన్‌ఎస్ వగీర్ నౌకాదళంలోకి ప్రవేశించింది. తీరప్రాంతాల్లో గస్తీకి, నిఘాకు, ఇంటెలిజెన్స్ సేకరణకు ఈ సబ్ మైరన్ ఎంతో ఉపయోగపడుతుంది. తక్కువ కాలంలో భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి ఇది.
ఫ్రాన్స్ నుంచి పొందిన సాంకేతిక పరిజ్ఞానంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. ప్రపంచంలో అత్యుత్తమ సెన్సర్లలో కొన్ని దీనిలో వినియోగించారు. మెరైన్ కమాండోలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించేందుకూ ఇది అనుకూలం. ఈ జలాంతర్గామి నుండి సబ్ సర్ఫెస్ నుంచి సర్ఫెస్ కు క్షిపణులను ప్రయోగించవచ్చని, ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడిచేసే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొంది. ప్రత్యేక ఆపరేషన్ల సమయంలో శత్రు స్థావరాల్లోకి మెరైన్ కమాండోలను పంపిచే సామర్థ్యం కలిగి ఉందని నౌకా దళం పేర్కొంది దీనికి 1973లో ప్రారంభించిన సబ్ మైరన్ పేరైన ‘వగీర్’ పేరునే కొత్తగా నిర్మించినఈ సబ్‌మెరైన్‌కి పెట్టారు.