Nagaland: నాగాలాండ్ అసెంబ్లీలో తొలి మహిళా ఎమ్మెల్యే, చరిత్ర సృష్టించిన హెకానీ
Nagaland gets First Woman MLA, Hekani Jakhalu wins from Dimapur-III
నాగాలాండ్ చరిత్ర సృష్టించింది. మొట్ట మొదటి సారిగా ఓ మహిళా ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 48 ఏళ్ల హెకానీ జకాలు గెలుపొందింది. బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న NDPP దిమాపుర్ 3 నియోజకవర్గం నుంచి విజయకేతనం ఎగురవేసింది. హెకానీ అనూహ్య విజయం సాధించింది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. NDPP 2018 నుంచి బీజేపీకి మిత్ర పక్షంగా కొనసాగుతోంది.
ఒక న్యాయవాదిగా, యాక్టవిస్టుగా తన నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలైన హెకానీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచి తన సత్తా చాటింది. జన శక్తి పార్టీ నుంచి బరిలో దిగిన జిమోమీపై విజయసం సాధించింది. 2018 నుంచి మిత్రపక్షాలుగా ఉన్న NDPP-BJP మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
నాగాలాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత ఘోర పరాజయం పాలయింది. కనీసం ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ కూటమికి 39 స్థానాలు లభించాయి. ఎన్.డి.పి.పి-బిజేపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
మేఘాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవానికి లోనయింది. 17 స్థానాలను కోల్పోయింది. 5 స్థానాల్లో బిజేపి విజయం, 26 స్థానాల్లో ఎన్.పి.పి. గెలిచింది. మేఘాలయ లో ఎన్.పి.పి-బిజేపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. త్రిపురలో కూడా కాంగ్రెస్ చతికిల పడింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 33 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. త్రిపురలో బిజేపి ప్రభుత్వం కొలువదీరనుంది.