AAP Mla Mohinder Goyal: ఆ కాంట్రాక్టర్ నుండి నాకు రక్షణకల్పించండి..ఆప్ ఎమ్మెల్యే
AAP Mla Mohinder Goyal: ఆప్ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ అసెంబ్లీలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.అలాగే తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు రక్షణ కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే.. గోయల్ తన వద్ద ఉన్న డబ్బులను స్పీకర్ కి చూపిస్తూ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక కాంట్రాక్టర్ తనకు లంచం ఇచ్చారని అన్నారు. తన మాట వినాలని నన్ను బెదిరించే ప్రయత్నం చేశాడన్నారు.
ఢిల్లీ రోహిణీ లోని బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌లో తాత్కాలిక సిబ్బంది నియామకంలో అవకతవకలు జరిగాయని..దానిపై నేను పోరాటం చేస్తున్నాను. ఇదే విషయం ఉన్నతాధికారులకు చెప్పానని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న సదరు కాంట్రాక్టర్ నాకు లంచం ఇచ్చి తన నోరుమూయించాలని చూశారని అన్నారు. వారి చేతుల్లో తనకు ప్రాణ హాని ఉందని చెప్పారు. అయితే ఈ బెదిరింపులకు నేను లొంగనని, ఆ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పై స్పందించిన స్పీకర్ సభలోని పిటిషన్ల కమిటీకి తెలపాలని సూచించారు. ప్రస్తుతం మహేందర్ గోయల్ ఢిల్లీలోని రిథాలా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.