Modi: రాహుల్ గాంధీ పై మోడీ పరోక్ష విమర్శలు
Modi: ఇటీవల లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్‌లో మొత్తంగా ప్రజాస్వామ్య స్వరూపమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ లో మా మైక్ ను కట్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత పార్లమెంట్లో జరిగిన సమావేశాల్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శనివారం ఇండియా టుడే కాంక్లేవ్‌లో ప్రసంగించిన మోదీ, రాహులే లక్ష్యంగా పరోక్షంగా విమర్శలు చేశారు.
భారత దేశంలో శుభా సమయాల్లో దిష్టి తగలకుండా ఉండేందుకు దిష్టి చుక్క పెట్టే సంప్రదాయం మన దగ్గర ఉందని, కొందరు ఇప్పుడు ఆ దిష్టి చుక్క పెట్టే పనిలో ఉన్నారని రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా మోడీ ఈ వ్యాఖ్యలు చేసారు. దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్న తరుణంలో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మేధావులంతా భారత్ వైపే చూస్తున్నారని ఈ సమయంలో బయటి వాళ్ళతో మనగురించి ఇలా మాట్లాడడం తగదని అన్నారు.