PM Modi Foreign Tours: మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో అంత ఖర్చా
PM Modi Foreign Tours: గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లు ఖర్చయింది. కాగా ప్రధానమంత్రి హోదాలో మోదీవిదేశాల్లో అధికారిక పర్యటనలు చేస్తుంటారు. ఈ క్రమంలో గడిచిన ఐదేళ్లలో విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐదేళ్లలో మొత్తం 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గడిచిన ఐదేళ్లలో మోదీ విదేశీ ప్రయాణాలు, వాటికైన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలపాలని సభ్యులు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐదేళ్లలో ప్రధాని మొత్తం 36 విదేశీ పర్యటనలు చేశారు. అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ 2017లో ప్రధాని మోదీ తొలుత ఫిలిప్పీన్స్ లో పర్యటించారు.
2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీ పర్యటనలు చేశారు. 2019 సెప్టెంబర్ 21 నుంచి 28 తేదీల్లో మోదీ చేసిన అమెరికా పర్యటన కోసం అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చయినట్లు కేంద్రం తెలిపింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 26-28వ తేదీల్లో జపాన్ పర్యటనకు అత్యల్పంగా రూ.23లక్షలు ఖర్చయినట్లు పేర్కొంది. కాగా, వివిధ దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించడమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ చెప్పారు. అంతేకాదు 36 పర్యటనలలో ప్రధానమంత్రితో పాటు పర్యటనలలో పాల్గొన్న ప్రతినిధులు బృందాల వివరాలను కూడా వెల్లడించారు.
ఇలా మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు చేసిన పర్యటనల ఖర్చు రూ.239,04,08,625 అయినట్టుగా కేంద్రమంత్రి మురళీధరన్ లెక్కలు చెప్పారు. విదేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని మురళీధరన్ వ్యాఖ్యానించారు.