Delhi Liquor Scam: ఈడీ విచారణ ఎలా ఎదుర్కోవాలి, న్యాయవాదులతో కవిత చర్చలు
MLC Kavitha is discussing with her Lawyers about the ED Case
ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఢిల్లీలో తన లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. మరోసారి ఈడీ విచారణను ఎదుర్కోనున్న కవిత ఈ సారి ఏ విధంగా వ్యవహరించాలనే విషయంలో న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీన విచారణకు రావాలని ఈ.డి నోటీసులివ్వడంతో తదుపరి కార్యాచరణపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంలో కోర్టులో మార్చి 24 న విచరాణకు ముందుగానే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అరుణ్ రామచంద్ర పిళ్ళై కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంఉటన్న అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీలో అరుణ్ పిళ్ళై ఉండనున్నారు. ఈ నెల 17న బుచ్చిబాబు బాబుతో కలిపి అరుణ్ రామచంద్ర పిళ్ళై విచారణ జరగనుంది. అదే విధంగా ఈ నెల మార్చి18న వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిపి అరుణ్ పిళ్ళై విచారణ జరగనుంది. చివరిగా మార్చి 20న కవితతో కలిపి అరుణ్ పిళ్లై ని ఈడీ విచారించనుంది.
దర్యాప్తు సంస్థల విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు విశ్రాంతి లేకుండా విచారణ చేపడుతున్నాయి. గత కొన్ని నెలలుగా అనేక మందిని విచారించాయి. సీబీఐ ఒక వైపు, ఈడీ మరోవైపు వారాల తరబడి విచారణ చేస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు.