MLC Kavitha: ఈడీ విచారణకు హాజరు కాని కవిత, ఢిల్లీలో టెన్షన్ వాతావరణం
MLC Kavitha did not attend ED interrogation
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ విషయంలో టెన్షన్ నెలకొంది. ఈ రోజు విచారణకు హాజరు కావలసిన కవిత హాజరు కాలేదు. విచారణకు హాజరు కాలేనంటూ ఈడీకి కవిత సమాచారం పంపించారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ ఉందని..ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని ఈడీ కార్యాలయానికి తమ ప్రతినిధితో కవిత సమాచారం పంపారు. కవిత వినతిని ఈడీ డైరెక్టర్ తిరస్కరించారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.
దర్యాప్తు సంస్థల విచారణ
గత కొన్ని నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో సీబీఐ, ఈడీలు రంగంలో దిగాయి. అనేక మంది ఈ కేసులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసి విచారణ చేశాయి. అనేక విషయాలను వెల్లడించాయి. అనేక మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందని కొన్ని ఆధారాలు చేకరించిన సీబీఐ కవితను హైదరాబాద్ లో విచారించింది. కవిత ఇంటి వద్దకే సీబీఐ అధికారులు వచ్చి విచారణ చేశారు. సీబీఐ తర్వాత ఈడీ రంగంలో దిగింది. కవితకు నోటీసలు జారీ చేసింది. ఢిల్లీలోకి ఈడీ కార్యాలయంలో తమ ఎదుట హాజరు కావాలని కోరింది. ఈడీ కోరిన విధంగానే కొన్ని రోజుల క్రితం కవిత విచారణకు హాజరయ్యారు. ఈ రోజు రెండో సారి విచారణ జరగాల్సిన సందర్భంగా కవిత గైర్హాజరయ్యారు.