Mlas Poaching Case: జూలై 31కి వాయిదా పడ్డ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
Mlas Poaching Case: తెలంగాణలో బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. జూలై 31కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. సీబీఐ దర్యాప్తు లేకుండా స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్ దుష్యంత్ దవే నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. జూలై 31 వరకు దర్యాప్తుపై స్టే కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తుపై స్టే విధించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సార్లు స్టే అడగగా.. సుప్రీం ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది.
సీబీఐ దర్యాప్తు అధికారులకు సంబంధిత రికార్డులు, పత్రాలు అందించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దర్యాప్తుపై స్టేటస్ కొనసాగించాలని ఈ మేరకు సంజీవ్ ఖన్నా ధర్మాసనం నేడు ఆదేశాలు ఇచ్చింది. వరుస వాయిదాలు పడుతున్న ఈ కేసు ఏకంగా నాలుగు నెలలపాటు వాయిదా వేయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.