BRS Delhi office: బీఆర్ఎస్ ఢిల్లీ కార్యాలయం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు
Minister Prashant reddy and Joginipalli Santosh inspected BRS Delhi office
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఈనెల 14న ఢిల్లీలో జరగనుంది. అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఢిల్లీ కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించారు.
ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్‌లో అధినేత కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో… ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమారు పరిశీలించారు.
ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.
MP @MPsantoshtrs & Minister Vemula Prashanth Reddy visits the @trspartyonline (BRS) office in #Delhi. The office is all set to open on the 14th of this month and both the above leaders are making arrangements. pic.twitter.com/qNZGAaiTX8
— 𝐌𝐚𝐡𝐚𝐭𝐦𝐚 𝐊𝐨𝐝𝐢𝐲𝐚𝐫 (@Mahatma_Kodiyar) December 11, 2022