Varanasi Temple: కాశీలో శ్రీ అన్నప్రసాదం…
Varanasi Temple: వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో కొత్తరకం ప్రసాదాన్ని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రసాదంలో చిరు ధాన్యాలను వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రసాదాన్ని చిరుధాన్యాలతో చేసిన లడ్డూను, అదేవిధంగా ప్రసాదంగా శ్రీ అన్నదానం పేరుతో అందించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కాశీ విశ్వేశ్వరాలయం సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. చిరుధాన్యాలు, బెల్లం, నువ్వులు, బాదం, జీడిపప్పు, నెయ్యి, ఖోయాల మిశ్రమంతో ఈ శ్రీ అన్నప్రసాదాన్ని తయారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
మిల్లెట్స్‌ను ప్రొత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కన్నారు. చిరుధాన్యాల సాగును పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్వం రోజుల్లో మిల్లెట్స్‌ను ఆహారంగా ఎక్కువగా తీసుకునేవారు. మిల్లెట్స్‌ను ఆహారంగా తీసుకోవడం వలన ఆరోగ్యంగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో వరి, గోధుమలకు ఉన్న ప్రాధాన్యత మిల్లెట్స్‌కు లభించడం లేదు. దీంతో ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. మిల్లెట్స్‌ను ప్రొత్సహించాలని నిర్ణయించింది. మిల్లెట్స్ పండించే రైతులకు అనేవిధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తోంది.