Layoff: మెటాలో 10 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Layoff: కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కంపెనీలు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అందుకే ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఒక కంపెనీ చూసి.. మరో కంపెనీ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందన్న భయంతో అమెరికా కార్పొరేట్లు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ప్రత్యేకించి టెక్నాలజీ రంగ కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు వెనుకాడటం లేదు.
సోషల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ మలి విడత ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. తాజాగా మరో 10 వేల మంది ఉద్యోగులను ఇండ్లకు సాగనంపుతామని మంగళవారం ప్రకటించింది. దాదాపు మరో 5000 మంది కొత్త నియామకాలు సైతం ఆపేసారు. నాలుగు నెలల్లో 11 వేల మంది సిబ్బందిని తొలగించింది. రెండో విడత కూడా భారీగా ఉద్యోగాల కోత విధిస్తామని ప్రకటిస్తామని ప్రకటించడంతో ఉద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంది.