PM Mitra: తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్ పార్కులు
Mega Textile Parks to Be Set Up In 7 States
దేశంలో 7 మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీలలో ఈ మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయమై ఓ ట్వీట్ చేశారు. టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుతో భారతదేశంలో టెక్స్ టైల్ రంగం అభివృద్ధి చెందనుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
2021 అక్టోబర్ నెలలో కేంద్ర టెక్స్ టైల్ శాఖ పీఎం మిత్రా పార్కుల గురించి ప్రస్తావించింది. రూ.4445 కోట్ల వ్యయంతో 7 రాష్ట్రాల్లో టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతాల్లో పార్కుల ఏర్పాటు ఉంటుందని అప్పట్లో తెలిపింది. 2021-22 బడ్జెట్లో పీఎం మిత్రా స్కీం గురించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. మరో మూడేళ్లలో 7 మెగా టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు.
టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు 1000 ఎకరాలు కేటాయించనున్నారు. ముడి పదార్ధాలు, మౌళిక సదుపాయాలు, రోడ్డు, రైలు కనెక్టివిటీ, నీటి సౌకర్యం, కరెంట్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు.
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.
— Narendra Modi (@narendramodi) March 17, 2023
India embarks on a journey to become the global textile manufacturing hotspot.
Realising PM @narendramodi Ji's vision, seven Mega Integrated Textile Regions and Apparel Parks (PM Mitra) have been approved which will also open gateways to millions of new jobs.#PragatiKaPMMitra pic.twitter.com/J0MZ1UvLnU
— Amit Shah (@AmitShah) March 17, 2023
Under the leadership of PM Shri @narendramodi Ji, govt has meticulously calibrated the 7 PM MITRA parks establishment. #PragatiKaPMMitra pic.twitter.com/dtOunFTUMr
— Nitin Gadkari (@nitin_gadkari) March 17, 2023
Thank you Hon’ble PM Shri @narendramodi ji for the decision to set up PM MITRA mega textile park in Telangana.
This will give impetus to development of local textiles & handlooms, ensuring rapid economic growth for our weavers from Telangana. https://t.co/TQCm6gCaEE
— G Kishan Reddy (@kishanreddybjp) March 17, 2023
PM MITRA Parks is a practical replica of PM @narendramodi ji's 5F vision—Farm to Fibre to Factory to Fashion to Foreign !
It is indeed a significant step in making India a global centre for the production & export of traditional & technical textiles on a global scale. pic.twitter.com/ocpSQrRWSv— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 17, 2023
..