Maoist Comittee: హిడ్మా చనిపోలేదు.. బాంబు పేల్చిన మావోయిస్టు కమిటీ!
Maoist Comittee Denies Hidma Death: నిన్న జరిగిన కాల్పులఫై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేస్తూ పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖ విడుదల కాగా ఈ లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా చనిపోలేదని పేర్కొన్నారు. హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హిడ్మా సేఫ్ గా ఉన్నాడనీ లేఖలో. వెల్లడించారు. అంతేకాక లేఖలో దక్షిణ బస్తార్ లోని జంగిల్ కొండల ఫై పోలీసులు, సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలు, డ్రోన్ లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశారని అటవీ ప్రాంతంలో ఉన్న తమపై వారు వైమానిక దాడులకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు.
ఇక గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారని లేఖలో ఆరోపించిన మావోయిస్టులు, మావోయిస్ట్ పార్టీ నాయకత్వం ను పీఎల్జీయేను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు అని ఆరోపించారు. రాత్రి, పగలు లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారని అన్నారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు జరుగుతున్నాయని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు కూడా వెళ్లలేకపోతున్నారని కూడా లేఖలో మావోయిస్టులు వెల్లడించారు. ఇక ఇలాంటి వాటిని తిప్పి కొట్టేందుకు ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. అయితే హిడ్మా చనిపోయాడు అంటూ పోలీసుల సమాచారం నిజం కాదని మావోయిస్టులు ప్రకటించడంతో అదిప్పుడు చర్చనీయాంశం అయింది.