భారత ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే
భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ పాండే ఎంపికయ్యారు. ఇండియన్ ఆర్మీ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న మనోజ్ పాండేను ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్మీ చీఫ్ కానున్న తొలి వ్యక్తి పాండేనే కావడం విశేషం. మనోజ్ పాండే ఈ నెల 30న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
మరోవైపు ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ నవరణేను భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించే అవకాశం ఉంది. భారత కొత్త ఆర్మీ చీఫ్ అధికారిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. గత ఏడాది తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దుర్మణం చెందారు. నాటి నుంచి నేటి వరకు ఆ స్థానం ఖాళీగానే ఉంటుంది. ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎవ్వరినీ ప్రకటించలేదు. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నవరణేను నియమించే ఛాన్స్ ఉంది.