Manish Sisodia: మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ, మండిపడ్డ కేజ్రీవాల్
Manish Sisodia arrested by ED after interrogating him for 3 days
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది. సీబీఐ కోర్టులో రేపు సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సిసోడియాను గత మూడు రోజులుగా ఈడీ విచారించింది. ప్రస్తుతం అరెస్టు చేసింది. రేపు ఉదయం ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనుంది.
ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టు అయిన సిసోడియా కొన్ని రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు. సీబీఐ కస్టడీ ముగియడంతో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఈడీ విచారణ జరిపి అదుపులోకి తీసుకుంది.
సిసోడియాను ఈడీ అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. సిసోడియాను ఎట్టిపరిస్థితుల్లోను జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని ఈడీ చూస్తుందని విమర్శించారు. బీజేపీకి చెందిన ఏడుగురు నేతలు అవినీతిలో కూరుకుపోయినా వారిపై సీబీఐ, ఈడీ దాడులు ఉండవని కేజ్రీవాల్ మండిపడ్డారు. పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ట్వీట్ చేశారు.
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 9, 2023
मनीष को पहले CBI ने गिरफ़्तार किया। CBI को कोई सबूत नहीं मिला, रेड में कोई पैसा नहीं मिला। कल बेल पर सुनवाई है। कल मनीष छूट जाते। तो आज ED ने गिरफ़्तार कर लिया। इनका एक ही मक़सद है – मनीष को हर हालत में अंदर रखना। रोज़ नये फ़र्ज़ी मामले बनाकर। जनता देख रही है। जनता जवाब देगी
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 9, 2023