Manish Sisodia Arrest : మొన్న సీబీఐ… నిన్న ఈడీ
Manish Sisodia arrest by ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవలే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన ఆయన్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మార్చి 20 వ తేదీ వరకు ఢిల్లీ కోర్టు జ్యూడిషియల్ కష్టడీ విధించింది. కాగా, ఇదే కేసులో గురువారం రోజున ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరోసారి మనీష్ సిసోడియాను విచారించారు. ఈ విచారణ అనంతరం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తీహార్ జైలులో ఉండగానే ఈడీ అధికారులు విచారణ జరిపి అక్కడే మరోమారు అరెస్ట్ చేయడంతో ఈ కేసు కీలక మలుపులు తిరుగుతున్నది.
ఈ కేసులో ఇప్పటి వరక మొత్తం 11 మందికి నోటీసులు జారీ చేసి అనేక మందిని అరెస్ట్ చేశారు. కాగా కొందరికి బెయిల్ లభించగా, మరికొందరు జైలులోనే ఉన్నారు. సీబీఐ కేసును దర్యాప్తు చేస్తుండగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మనీలాండరింగ్ పై విచారణ జరుపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో ఈడీ రేపు కల్వకుంట్ల కవితను కూడా విచారణ చేయబోతున్నది. రామచంద్ర పిళ్లై ఇచ్చి వాగ్మూలాన్ని అనుసరించి కవితను విచారణ చేయబోతున్నారు. ఈ విచారణ తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.