Manik Saha: త్రిపురలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మానిక్ సాహా
Manik Saha Takes Oath As Tripura Chief Ministe
త్రిపురలో కొత్త సర్కారు కొలువుతీరింది. మానిక్ సాహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి సీఎం పీఠం దక్కించుకున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో 8 మందిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. గవర్నర్ సత్యదియో నారాయణ్ ఆర్య వీరందరితో ప్రమాణం చేయించారు. అగర్తలోని స్వామి వివేకానంద గ్రౌండ్స్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటామని అభయమిచ్చారు. మానిక్ సాహా ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు.
ఈశాన్య రాష్ట్రాల్లో గత మూడు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని విధంగా లెఫ్టేతర ప్రభుత్వం తిరిగి అధికారం హస్తగతం చేసుకుంది. ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని నాయకులు చెబుతున్నారు. 1988లో కాంగ్రెస్, TUJS నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకుంది. 1993లో జరిగిన ఎన్నికల్లో ఆ కూటమి ఓటమి పాలయింది. మరోసారి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి త్రిపురలో వారి ఆధిపత్యం క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది.
Dr. Manik Saha takes oath as Chief Minister of #Tripura for second consecutive time. Dr. Saha was administered oath of office by Governor Satyadeo Narayan Arya at a grand ceremony in Swami Vivekananda Ground in Agartala pic.twitter.com/nZVhDem8zH
— All India Radio News (@airnewsalerts) March 8, 2023
আজ হোলি উৎসবের পূণ্যদিনে মুখ্যমন্ত্রী রুপে দ্বিতীয়বার শপথ গ্রহনের পূর্বে আগরতলাস্থিত লক্ষ্মী নারায়ণ বাড়িতে পূজো দিয়ে সকল রাজ্যবাসীর মঙ্গল কামনা করি। #UnnataTripuraSresthaTripura pic.twitter.com/P2dd7a9e1r
— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) March 8, 2023