Maha CM: పదవి నుంచి తప్పుకోడానికి సిద్ధంగా ఉన్నా
అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ అజెండాను వదిలిపెట్టలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. శివసేన పార్టీ స్థాపకుడు బాలా థాకరే ఆశయాలకు అనుగుణంగానే పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
మహారాష్ట్రలో శివసేన సర్కారు సంక్షోభంలో పడింది. రెబల్ ఎమ్మెల్యేలు దెబ్బ కొట్టడంతో ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాకరే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తాను చేసిన తప్పేంటో రెబల్ ఎమ్మెల్యేలు చెప్పాలని థాకరే డిమాండ్ చేశారు. ఏక్‌నాథ్ షిండే తనతో నేరుగా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో మరో శివసైనికుడికి అవకాశం ఇవ్వడానికి తనకేమీ అభ్యంతరం లేదని సీఎం స్ఫస్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన రాజకీయ కురు వృద్ధుడు శరద్ పవార్ రంగంలో దిగారు. థాకరే ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తీసుకోవలసిన నిర్ణయాలపై చర్చిస్తున్నారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో సీఎం థాకరే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోయినా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని థాకరే అన్నారు. మళ్లీ గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
శివసేన చీఫ్‌గా దిగిపోవటానికి సిద్దంగా ఉన్నానని.. సీఎం అధికారిక నివాసం ఖాళీ చేయటానికి సిద్దంగా ఉన్నాని స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖ సిద్దంగా ఉందని తెలిపారు. దేశంలో టాప్ 5 సీఎంలో తాను ఒకడిగా గుర్తింపు పొందానని థాకరే గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి ఉండాలని తానెప్పుడు కోరుకోలేదని సీఎంగా ఉండమని పవార్ అడిగడంతో ఆ పదవిని ఛాలెంజింగ్‌గా స్వీకరించానని చెప్పారు. బాల్ థాక్రే వారసత్వం కొనసాగించేది తామేనని మరోసారి స్పష్టం చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని..తాను రాజీనామా చేయడానికి సిద్దమని గవర్నర్‌కు సమాచారం ఇచ్చానని ఉద్ధవ్ థాకరే తెలిపారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తానెంతో నిజాయితీగా పనిచేశానని సీఎం ఉద్ధవ్ థాకరే తెలిపారు. సీఎం కావాలని తానెప్పుడు కోరుకోలేదని...అనుకోకుండా వచ్చిన పదవిని వదులుకోడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన వద్ద రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రిగా తప్పుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని...రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తెలిపారు. తన నిర్ణయాలను గవర్నర్‌కు తెలియజేశానని సీఎం తెలిపారు.
రెబల్ ఎమ్మెల్యేలు కోరితే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. వారంతా తనతో చర్చించినట్లయితే అనేక విషయాల్లో క్లారిటీ వచ్చేదని అన్నారు.
హిందుత్వాన్ని శివసేన ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వారంతా తమ తమ అభిప్రాయాలను తన ముందుకు వచ్చి చెప్పలేదని మండిపడ్డారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని..సవాళ్లను స్వీకరించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.