Madhya Pradesh Minister Pradhuman Singh tomar Apologise for bad condition of Road: క్షమాపణలు చెప్పి ఓ వ్యక్తి కాళ్లు కడిగిన మధ్యప్రదేశ్ మంత్రి
Madhya Pradesh Minister Pradhuman Singh tomar Apologise for bad condition of Road: మధ్యప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై ఆ రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల దుస్థితికి క్షమాపణలు చెప్పడమే కాకుండా అక్కడ ఉన్న ఓ సాధారణ వ్యక్తి కాళ్లు కడిగాడు. అంతేకాకుండా, రోడ్లు బాగు చేయిస్తానని హామీ ఇచ్చాడు. దీనిని సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు ఆయన గ్వాలియర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్‌లో పర్యటిస్తున్న సమయంలో రోడ్లపై గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా మారిపోయాయి.
రోడ్ల దుస్థితిని చూసి ఆయన షాకయ్యారు. మురుగునీటి పైప్‌పైన్ కోసం రోడ్డును తవ్వి అలానే వదిలేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లను తవ్వి వదిలేయడం సమంజసం కాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నందుకు క్షమాపణలు చెప్పారు. రోడ్లను నిర్మించాలని కోరుతూ మంత్రి ప్రధుమన్ చెప్పులు లేకుండా నడుస్తుండటంతో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా మంత్రి ప్రధుమన్‌కు చెప్పుల జతను అందించారు. వీలైనంత తర్వరగా రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారింది.