Love Today: తమిళనాడులో లవ్ టుడే సినిమా సీన్ రిపీట్.. పెళ్లి క్యాన్సిల్!
Love Today Scene Repeat: తమిళనాడులో లవ్ టుడే సినిమా సీన్ రిపీట్ అయింది. ఈ మధ్య కాలంలో విడుదలైన లవ్ టుడే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఫోన్లు మార్చుకున్న అంశం హైలైట్ అయింది. ఇప్పుడు సినిమా తరహాలో ఫోన్ మార్చుకుని ప్రేమికులు పెళ్లి చేసుకోవాలి అనుకోగా అది ఫెయిల్ అయింది. తమిళనాడులోని సేలం జిల్లా వాజప్పాడి ప్రైవేట్ ఆసుపత్రిలో అరవింద్ అనే వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లికి ఈ ప్రేమ జంట సిద్దమైంది. పెళ్ళి ఫిక్స్ అయినా సంతోషంలో లవ్ టుడే సినిమా తరహాలో సెల్ ఫోన్ మార్చుకున్నారు ఇద్దరూ. అయితే ప్రియుడు అరవింద్ సెల్ ఫోన్‌లో పదో తరగతి చదివే అమ్మాయి న్యూడ్ వీడియోలు, ఫోటోలతొ పాటు అరవింద్ రొమాన్స్ వీడియో చూసి కంగుతిన్న ప్రియురాలు తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే తనను మోసం చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అని తల్లిదండ్రులకు విషయాన్ని కన్వే చేసి వెంటనే మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది ప్రియురాలు. ఆ ఫిర్యాదు మేరకు వజప్పాడి పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ అరవింద్‌ను అరెస్టు చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.