Leave Letter Viral: ఆ ఆవిడ అలిగింది.. సెలవివ్వండి ప్లీజ్!
Leave Letter Viral: ఉత్తర ప్రదేశ్ ఫరూఖాబాద్‌లోని ఓ ఇన్‌స్పెక్టర్ హోలీ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో, ఇన్‌స్పెక్టర్ భార్య గత 22 సంవత్సరాలుగా హోలీకి తన తల్లి ఇంటికి వెళ్లడం లేదని అలిగిందని రాశారు. ఈసారి ఆమెను ఇంటికి తీసుకెళ్లాలి కాబట్టి దయచేసి 10 రోజులు సెలవు ఇవ్వండి అంటూ ఇన్‌స్పెక్టర్ పండుగ సెలవు కోసం ఎస్పీ కార్యాలయానికి దరఖాస్తు పంపారు. ఈ ప్రత్యేక లేఖను చూసిన పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనా దానిపై దృష్టి సారించారు. ఇన్స్‌పెక్టర్‌కి పదిరోజులు కాదు ఐదు రోజుల సెలవును ఆమోదించాడు. పోలీసు ఇన్స్‌పెక్టర్ రాసిన ఈ అప్లికేషన్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. హోలీ పండుగ రోజున పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయబడ్డాయి. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేయబడ్డాయి. కానీ పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఈ సమస్యని చెబుతూ పదిరోజుల సెలవు కోరారు. మీనా ఇన్స్‌పెక్టర్‌సమస్యను సానుభూతితో పరిగణలోకి తీసుకుని ఐదు రోజులు సెలవు ఇచ్చారు. అశోక్ కుమార్ ఫతేగఢ్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ చదివిన ప్రజలు ఇన్‌స్పెక్టర్‌కు సానుభూతి తెలుపుతున్నారు.