Joshimath: జోషీమఠ్ భూమి కుంగుబాటు పై అంతరిక్ష పరిశోధన షాకింగ్ రిపోర్ట్
Joshimath: ఉత్తరాఖండ్‌లో జోషీమఠ్ కుంగుబాటుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షాకింగ్ రిపోర్ట్ బయటపెట్టింది. 12 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 5.4 సెంటిమీటర్లు భూమి కుంగుబాటుకు గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాటిలైట్ ఫొటోలు రిలీజ్ చేసింది.
డిసెంబర్ 27 నుండి జనవరి 8 మధ్య ఈ నగరంలో భూమి వేగంగా కుంగటం ప్రారంభమైనట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్‌లను ఇస్రో విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్ – నవంబర్ మధ్యలో 9 సెంటీ మీటర్లు కుంగిందని తెలిపింది. ఆర్మీ హెలిప్యాడ్ మరియు దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలోని సెంట్రల్ జోషిమఠ్‌లో మట్టిని వేగంగా తరలించడం ప్రధాన కారణం. 2,180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్ – ఔలి రహదారికి సమీపంలో ఈ క్షీణత ఉందని నివేదిక పేర్కొంది.
ఈ జోషీమఠ్ టెంపుల్ టౌన్ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు గేట్ వేగా ఉంది. శాటిలైల్ సర్వే తర్వాత 4వేల మంది రిలీఫ్ క్యాంపులకు తరలించగా నిర్మాణాత్మక పనులను నిలిపివేశారు. మరోవైపు ఇప్పటికే సీఎం పుష్కర్ సింగ్ ధామి 3వేల కుటుంబాలకు రూ.45 కోట్ల పరిహారం ప్రకటించారు. ఈ ప్రాంతంలోని భవనాలు, రోడ్లలో పగుళ్లు ఏర్పడటంతో విపత్తు అంచున ఉన్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 4,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. హోటల్స్, వ్యాపార సంస్థలతో 678 గృహాలు ప్రమాదంలో ఉన్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) చేపట్టిన ప్రాజెక్ట్ వల్ల భూమి కుంగుతుందని మరికొందరు ఆరోపిస్తున్నారు.