Madya Pradesh: హనుమంతుడి ముందు ఏంటా పని
Madya Pradesh: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో మహిళా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ డ్రెస్‌కోడ్ వివాదాస్పదమైంది. బికినీలు ధరించిన లేడీ బాడీబిల్డర్లు ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బికినీ దుస్తుల్లో.. మహిళా బాడీ బిల్డర్ల ప్రదర్శనా అంటున్నారు నెటిజన్లు. 2023, మార్చి 4, 5 తేదీల్లో.. రెండు రోజులు జరిగిన ఈ పోటీలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హనుమంతుడి బొమ్మ ముందే ఆడవాళ్లు అర్ధనగ్న ప్రదర్శన చేయడమేంటనే విమర్శలు వినపడుతున్నాయి. మహిళా బాడీ బిల్డర్లు అందరూ పాల్గొనటం ఓ విషయం అయితే.. వీటిని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించటం చర్చనీంయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా, రత్లాం మేయర్ ప్రహ్లాద్ పటేల్ ఈ పోటీలు నిర్వహించారని సమాచారం. కసరత్తులు అంటే హనుమాన్ విగ్రహం ఉండి తీరాల్సిందే.. బలానికి ప్రతీక అయిన హనుమంతిని బొమ్మ ఎదుట.. మహిళలు బికినీ దుస్తుల్లో బాడీ బిల్డర్ పోటీలు ఏర్పాటు చేయటం ఏంటంటూ ప్రతిపక్షాలవారు మంది పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసే కళ్లను బట్టి కొందరిలో అశ్లీలత కనిపిస్తే.. మరికొందరిలో ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది అంటున్నారు. మరికొందరు మాత్రం హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పే బీజేపీ వాళ్ళు ఇలా చేయటం సరికాదని అంటున్నారు.