Kishan Reddy: టీఎస్పీఎస్సీ లీకేజీ చేతకాని తనమే..అందుకే అబద్దాల ప్రచారం!
Kishan Reddy: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిది చేతకాని తనమే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద అబద్దాల ప్రచారం చేస్తున్నారని అన్నారు. మద్యం కేసు డైవర్ట్ చేయడానికే మహిళా బిల్లు పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. అసలు మద్యం వ్యాపారం చేసింది ఎవరు..? డబ్బులు తీసుకుంది ఎవరు..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద పిల్లలు, పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి హెల్తి బేబీ షో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అంగన్వాడీ , వెల్ నెస్ సెంటర్స్ , ఆయుష్మాన్ భారత్ లాంటి కార్యక్రమాలు కేంద్రం తరపున చేస్తున్నామని పేర్కొన్న ఆయన చిన్నపిల్లల తల్లిపాలు తాగి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. పిల్లలు ఆరోగ్యం గా ఉంటే మనం ఉన్నట్లేనని పేర్కొన్న ఆయన రానున్న రోజుల్లో మోడీ నాయకత్వంలో ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేపడతామని అన్నారు.