Amrit Pal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్
Khalistan leader Amritpal Singh arrested in Jalandhar
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛేజింగ్ చేసి మరీ జలంధర్‌లో అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పంజాబ్ పోలీసులు అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు, SMS సర్వీసులు బంద్ చేసింది.
అమృత్ పాల్ సింగ్ ఎవరంటే..
అమృత్ పాల్ సింగ్ వారిస్ పంజాబ్ డీ అనే సంస్థను ప్రస్తుతం నడుపుతున్నాడు. నటుడు దిలీప్ సిద్ధు ఆ సంస్థను స్థాపించాడు. సిద్ధు మరణంతో ఆ సంస్థకు అమృత్ పాల్ సింగ్ అధ్యక్షుడయ్యాడు. కొన్ని వారాల క్రితం లవ్ ప్రీత్ సింగ్ అనే తన అనుచరుడిని పోలీసులు అరెస్టు చేయడంతో అమృత్ పాల్ సింగ్ చెలరేగిపోయాడు. అంజాలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించాడు. అతడి అనుచరులు పోలీసు స్టేషన్ సమీపంలోని బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు.
Protest taken out in #Punjab's #Mohali in support of #AmritpalSingh pic.twitter.com/mzQWAUxPgS
— Akashdeep Thind (@thind_akashdeep) March 18, 2023
Protest taken out from Quami Insaaf Morcha in Mohali after the report of arrest of Amritpal Singh #AmritpalSingh pic.twitter.com/Gb1y57A5AK
— Gagandeep Singh (@Gagan4344) March 18, 2023