First Pregnant Transman: తొలిసారిగా బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్ జెండర్ జంట
First Pregnant Transman: మాతృత్వం అనేది ప్రతీ స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప వరం. మహిళ గర్భం దాల్చడం సర్వసాధారణమే పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనా ఇలా తల్లిప్రేమ మొత్తం తమ పిల్లలపై చూపెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ ఇక్కడ ఓ ఈ క్రమంలో దేశంలోనే తొలిసారి ఓ వింత ఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు తల్లిదండ్రులు కాబోతున్నారు. గర్భం దాల్చిన ట్రాన్స్ జెండర్ జంట మరో నెల రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వినడానికి వింతగానే ఉన్న ఇదినిజం. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జియా, జహాద్‌లు గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించింది. ‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన (జహాద్) కోరిక త్వరలోనే తీరనునున్నాయి.’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
పురుషుడిగా మారిన ఒక మహిళ గర్భవతిగా ట్రాన్స్ జెండర్లకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. వారు సరోగసి ద్వారానో లేదా ఎవరి వద్దనుంచి అయినా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారానో సంతానం కోసం ప్రయత్నం చేస్తారు. అయితే అలా కాకుండా నేరుగా పురుషుడిగా మారిన ఒక మహిళ గర్భవతిగా మారి మరీ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం అతడిగా మారిన ఆమె ఎనిమిదో నెల గర్భంతో ఉంది. ఇది ఎలా సాధ్యమంటే ట్రాన్స్ జెండర్‌గా మారిన సమయంలో చేయించుకున్న శస్త్ర చికిత్సలో అతని గర్భాశయాన్ని, మరికొన్ని అవయవాలను తొలగించకపోవడం వల్ల ఇది సాధ్యపడుతుందని డాక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా సృష్టికి భిన్నంగా ట్రాన్స్ జెండర్లు గా మారిన వీరు తల్లిదండ్రులు కావడం ఆశ్చర్యాన్ని కలిగించినా తల్లిదండ్రులు కావాలనే వీరి కోరికను నెటిజెన్లు వీరికి సెల్యూట్ చేస్తున్నారు.