మతం మారుస్తున్న మహిళ సంబంధం లేదంటూ కుటుంబ సభ్యుల ప్రకటన
Karnataka Women : కర్ణాటక (karnatak)లో ఎన్నికల (Election)తర్వాత ఓ మహిళ ఇప్పుడు సంచలనమైంది. బీడీఎస్ (BDS)చదువుతూ ప్రేమలో పడిన ఆ మహిళ మతం మార్చుకుని ఐసీసీ (ISIS) వైపు ఆకర్షితురాలైంది. అంతటితో ఆగకుండా స్థానికులను ఉగ్రవాదంవైపు ప్రోత్సహిస్తోంది ఆ మహిళ. ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమా కథకు కాస్త దగ్గగా ఉన్నట్టు అనిపిస్తోన్న ఈ వ్యవహారం వెలుగులోకి రావటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో మాజీ ఎమ్మెల్యే (MLA) మనవడు పేరు కూడా బయటకు రావటం ఆశ్చర్యకరమైన అంశం.
అరెస్ట్‌తో బయటపడ్డ అసలు నిజం
ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉగ్రవాద అనుమానితు కోసం నేషనల్ ఇన్వెస్టింగ్ ఏజెన్స్ ( NIA)సోదాలు నిర్వహించింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఇందులో భాగంగా కర్ణాటకలో ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను విచారించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని కొడగు గ్రామానికి చెందిన దీప్తి మార్లను అదుపులోకి తీసుకున్నారు. బీడీఎస్ చదువుతున్న దీప్తిని అనాస్ అబ్దుల్ రహమాన్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మతం మార్పించి.. దీప్తి పేరును మరియంగా మార్చినట్లు గుర్తించారు.
మాజీ ఎమ్మెల్యే మనవడు…
మాజీ కాంగ్రెస్ నేత, 3 సార్లు ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ.. మనవడు అనాస్ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తర్వాత ఆమె ఐసిస్‌తో సంబంధాలు పెట్టుకుందని.. స్థానికులను ఐసిస్ ఉగ్రసంస్థలోకి చేరేలా ప్రోత్సహించిందని వివరించారు. చాలా మంది యువతులను ఆమె సిరియాకు తరలించిందన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా…. ఆమెను ప్రోత్సహించిన వారెవరు.. ఇలా రకరకాల కోణాల్లో విశ్లేషిస్తున్న ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
పేపర్ ప్రకటన
అయితే దీప్తి అలియాస్ మరియం అరెస్ట్ విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు స్పందించారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. దీప్తి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినప్పటి నుంచి ఎలాంటి రాకపోకలు గానీ.. ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు లేవని తెలిపారు. దీప్తి తన ఇష్టం తోనే మతం మారిందని వెల్లడించారు. ఆమె, ఆమె భర్త, పిల్లలకు గానీ తమ ఆస్తిలో ఎలాంటి వాటా ఉండదని తేల్చిచెప్పారు. ఆమె చేసే పనులు, నేరాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
Name: Maryam (converted)
Pre conversion name: DeepthiNIA arrested her from Mangalore and her brother-in-law Ammar Abdul Rahman from Ullal for suspected ISIS links.
Her biological parents has disowned her through a newspaper ad after she was arrested. pic.twitter.com/8wpJLZr7Wg
— Anshul Saxena (@AskAnshul) May 19, 2023