విద్యార్థులకు వేసవి సెలవులు అవసరమేనని తేల్చిచెప్పింది కేరళ హైకోర్టు..నెక్స్ట్ అకడమిక్ విద్యాసంవత్సరానికి పిల్లలు ఎక్కువ ఉత్సహంతో విద్యాలయాలకు వస్తారు అందుకు వేసవి సెలవులు ఎంతగానో దోహదపడతాయని కేరళ హైకోర్టు తెలిపింది.
Kerela Highcourt : విద్యార్థులకు వేసవి సెలవులు అవసరమేనని తేల్చిచెప్పింది కేరళ హైకోర్టు..నెక్స్ట్ అకడమిక్ విద్యాసంవత్సరానికి పిల్లలు రెట్టించిన ఉత్సాహంతో విద్యాలయాలకు వస్తారని, అందుకు వేసవి సెలవులు ఎంతగానో దోహదపడతాయని కేరళ హైకోర్టు తెలిపింది. మానసిక ఉల్లాసం కోసం స్నేహితులతో, బంధువులతో,ఇతర యాక్టీవిటీస్ కోసం లేదా తల్లిదండ్రులతో వేరే ప్రదేశానికి వెకేషన్ కోసం సరదాగా గడిపేందుకు ఈ సెలవులు అవకాశం కల్పిస్తాయని న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని కేరళ విద్యాశాఖ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఎస్ఈ స్కూల్స్ కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్ ను తప్పు పట్టింది కోర్ట్
సీబీఎస్ఈ పాఠశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టుల ఇరువైపులా వాదనలు విన్న కోర్ట్ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభ్యంతరం లేకపోతే ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చని 2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేనని, దానిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పిల్లల వైపు న్యాయం ఉందని తెలిపింది. నిత్యం చదువుతుతో సతమతమయ్యే విద్యార్థులు ఆహ్లదకరమైన జీవనాన్ని కోరుకుంటాడు కనుక వారికీ వేసవి సెలవులు ముఖ్యమని పేర్కొంది. సెలవుల్లో వారు ఆహ్లాదంగా గడపాలి. క్రికెట్, ఫుట్బాల్ లేదా ఇష్టమైన ఆటలు ఆడాలి.. డ్యాన్సులు చేయాలి.. పాడాలి. హోంవర్క్ కోసం భయపడాల్సిన అవసరం లేకుండా తమకు నచ్చినవి తీరిగ్గా తినాలి. వారికి ఇష్టమైన టీవీ కార్యక్రమాలు చూడాలి.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసంగా జీవనాన్ని గడిపి నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కచ్చితంగా పిల్లలకు విరామం తప్పనిసరి అని న్యాయమూర్తి తెలిపారు.