సైలెంట్ మోడ్ లోకి కేసీఆర్?
దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపొందడంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెంచుకున్న తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని నెలలుగా బీజేపీని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కంటే ముందు నుంచే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో, బహుశా ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు అయి ఉండవచ్చు కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో కాస్త తగ్గి బిజెపిపై విరుచుకు పడుతున్నారు. ఇక ఆయన కాంగ్రెస్-బీజేపీయేతర మూడవ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ అది ఫలించలేదు. ఇక ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడినప్పుడు మరోసారి బీజేపీ లేదా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడతారని అందరూ ఊహించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో ప్రస్తుతానికి తటస్థంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాల వల్లే ఆయన ఈ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారని అంటున్నారు. అయితే కేసీఆర్ జాతీయ స్థాయి నాయకుడు కావాలనే తన ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని పీకేతో చర్చిస్తున్నారని అంటున్నారు.