దేశంలో తీవ్ర దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)పై ఈడీ దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దోషి అని తేలితే మాత్రం ఆమె అరెస్ట్ తప్పదని సచిన్ కల్యాణ్ శెట్టి (Sachin Kalyan Shetty) చెప్పారు
Delhi liquor scam : మహారాష్ట్ర బీజేపీ నేత(Maharashtra BJP leader), అకల్‌కోట్ ఎమ్మెల్యే (Akalkot MLA )సచిన్ కల్యాణ్ శెట్టి(Sachin Kalyan Shetty) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)పై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. దేశంలో తీవ్ర దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam)పై ఈడీ దర్యాప్తు చేస్తోందన్న ఆయన.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దోషి అని తేలితే మాత్రం ఆమె అరెస్ట్ తప్పదని సచిన్ కల్యాణ్ శెట్టి (Sachin Kalyan Shetty) చెప్పారు
మహారాష్ట్రలో బీజేపీ బలంగా ఉందని సచిన్ కల్యాణ్ శెట్టి(Sachin Kalyan Shetty) అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో రాజకీయాలు చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేరని దీమా వ్యక్తం చేసారు. అయితే దేశంలో అతి పెద్ద సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) కేసులో విచారణ.. కొంతకాలంగా ఎందుకో సైలెంట్ అయిపోయింది. వివిధ రాజకీయపార్టీల నేతలంతా ఎన్నికల హడావుడిలో మునిగి తేలుతున్నారు. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ కవిత(Kavitha) అరెస్ట్ తప్పదంటూ తాజాగా ఈ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో మరోసారి చర్చకు దారితీస్తున్నాయి.