Delhi liquor Scam: ఈడీ మహిళా అధికారి సమక్షంలో కవిత విచారణ
Kavitha ED interrogation in the Presence of Lady officer
ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఓ మహిళా అధికారి సమక్షంలో ఈడీ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కవిత వ్యక్తిగత సమాచారాన్ని ఈడి అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
కవిత విచారణ వీడియో షూట్
కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో షూట్ చేస్తున్నారు. నలుగురు సభ్యుల గల ఈడి బృందం విచారణ చేపడుతోంది. లిక్కర్ స్కాం పూర్తి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉదయం సరిగ్గా 11 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. సరిగ్గా 11.08 నిమిషాలకు ఈడీ ఆఫీస్ చేరుకున్నారు.
ఈడీ అరెస్టు ..ఏ సెక్షన్ ప్రకారం
ఒక వ్యక్తిని ఈడీ అరెస్టు చేయాలంటే కొంత న్యాయ ప్రక్రియను ఫాలో అవుతుంది. PMLA(ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ) సెక్షన్ 11, సెక్షన్ 50 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారు. తాము సేకరించిన సమాచారం ఆధారం చేసుకుని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తారు. సరైన సమాధానాలు ఇవ్వడం లేదని భావిస్తే PMLA సెక్షన్ 19 ప్రకారం అరెస్టు చేస్తారు.