Viral Infections: ప్రాణాలను కబలిస్తోన్న H3N2 వైరస్, కర్ణాటక, హర్యానాలో ఇద్దరు మృతి
Karnataka reports India’s first death from H3N2 virus
H3N2 వైరస్ ప్రాణాలను కబలిస్తోంది. కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కక్కరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొట్ట మొదటి మరణం కర్ణాటకలో సంభవించింది. 82 ఏళ్ల వృద్ధుడు H3N2 వైరస్ కారణంగా మార్చి1న మరణించినట్లు కర్ణాటక ఆరోగ్యశాఖ వెల్లడించింది. హిరే గౌడ అనే 82 ఏళ్ల వృద్ధుడు ఫిబ్రవరి 26న ఆసుపత్రిలో చేరాడని, కొన్ని రోజుల చికిత్స తర్వాత మార్చి 1న మరణించాడని వైద్యులు తెలిపారు. అతడి నుంచి సేకరించిన శాంపుల్ ను పరీక్షించారు. మార్చి 6న రిపోర్టు వచ్చింది. వైరస్ సోకడం వల్లే చనిపోయాడని రిపోర్టు వెల్లడించింది. ఆసుపత్రిలో చేరేనాటికే హిరే గౌడకు డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్నాయని వైద్యులు తెలిపారు.
5వ స్థానంలో తెలంగాణ
ఇన్ఫ్లూయెంజా కేసులు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తం అయింది. ఏ ఏ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నాయో గమనిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సేకవరించిన వివరాల ప్రకారం తెలంగాణలో కేసులు విపరీతంగా ఉన్నట్లు తేలింది. కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నట్లు తెలిసింది.
తమిళనాడులో అత్యధికంగా 887 కేసులు
తమిళనాడులో అత్యధికంగా 887 కేసులు నమోదవగా, 744 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉందన్నారు. ఢిల్లీ 352 కేసులో ఢిల్లీ మూడో స్థానంలో, 223 కేసులతో యూపీ నాల్గవ స్థానంలో నిలిచింది. 205 కేసులతో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పిల్లలకు మాత్రమే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటున్నట్లు తెలుస్తోంది.
పెద్దవాళ్లు ఓపీ ట్రీట్‌మెంట్‌తోనే కోలుకుంటున్నారని తెలిసింది.