Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈకార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు, చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి 13,638 ఓట్ల తేడాతో వరుసగా మూడోసారి ప్రియాంక్ ఖర్గే విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక్ ఖర్గేకు 81,088 ఓట్లు రాగా.. ఆయన బీజేపీ ప్రత్యర్థి మణికంఠ రాథోడ్‌కు 67,450 ఓట్లు వచ్చాయి.
కర్ణాటక కేబినెట్లో మంత్రులుగా కేజే జార్జ్, ఎంబీ పాటిల్ ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
Bengaluru | Dr G Parameshwara, KH Muniyappa, KJ George and MB Patil take oath as cabinet ministers in the newly-elected Karnataka Government. pic.twitter.com/vGHhl0louL
— ANI (@ANI) May 20, 2023
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప కర్ణాటక కేబినెట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునియప్ప దేవనహళ్లీ నియోజకవర్గం నుంచి 4 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
కర్ణాటక మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న జి. పరమేశ్వర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. డీకే శివకుమార్ చేత కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు.
DK Shivakumar takes oath as the Deputy Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/OSGc7ck4tV
— ANI (@ANI) May 20, 2023
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ సిద్దరామయ్య చేత ప్రమాణస్వీకారం చేయించారు.
Senior Congress leader Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka in Bengaluru. pic.twitter.com/9VUBNNsuv2
— ANI (@ANI) May 20, 2023
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాసేపటి క్రితం బిహార్ సీఎం నితీశ్ కుమార్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్విందర్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ హాజరయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానం మేరకు ఆయన విచ్చేశారు. మరికాసేపట్లో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు
కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. మరికాసేపట్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారోత్సవానికి 19 పార్టీలను ఆహ్వానించారు. అయితే ఆప్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఆహ్వానం అందలేదు. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీ, జనతాదళ్(యునైటెడ్) సీపీఐ ఎంఎల్, సీపీఎం, సీపీఐ, తృణముల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, శివసేన యూబీటీ, డీఎంకే, ఎండీఎంకే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఐయూఎంఎల, ఆర్ఎస్పీ పార్టీలకు ఆహ్వానం పంపారు.