Kalvakuntla Kavitha: మహిళా రిజర్వేషన్లు పార్లమెంటు ఆమోదం పొందే వరకు పోరాటం
Kalvakuntla Kavitha: ఢిల్లీలో ధర్నా చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ అంశం రాజకీయం చేయడానికి కాదని, పేర్కొన్న ఆమె ఈ సర్కార్కు పూర్తి బలం ఉంది… మోడీ సర్కార్ అనుకుంటే రెండు గంటల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడాలని, రాజకీయ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచాలని అన్నారు. ఢిల్లీలో దీక్ష పూర్తయిందని పేర్కొన్న కవిత ఆయా ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్షలు చేస్తామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్షలు చేస్తామని పేర్కొన్న కవిత మహిళల వైపు నిలబడాలని రాష్ట్రపతినీ కోరుతున్నానని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి మద్దతిచ్చిన రాజకీయ పార్టీల సంతకాలతో లేఖలు రాస్తామని మహిళా రిజర్వేషన్లు పార్లమెంటు ఆమోదం పొందే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు.