Jallikattu: తమిళనాడు (Tamilnadu) సాంప్రదాయక క్రీడ జల్లికట్టు వివాదంపై సుప్రీం కోర్టు (Supreme court) కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం (Tamilanadu government) చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. జల్లికట్టు సాంస్కృతిక వారసత్వంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని వెల్లడించింది.
Jallikattu: తమిళనాడు (Tamilnadu) సాంప్రదాయక క్రీడ జల్లికట్టు వివాదంపై సుప్రీం కోర్టు (Supreme court) కీలక తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం (Tamilanadu government) చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. జల్లికట్టు సాంస్కృతిక వారసత్వంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని వెల్లడించింది. దీంతో జల్లికట్టు పోటీలపై ఎటువంటి నిషేధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించింది. ఆ సమయంలో న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అలాగే కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు చట్టాలను రూపొందించాయి. ఆ చట్టాలను కూడా సుప్రీంకోర్టు సమర్ధించింది.
కాగా, ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టును నిర్వహిస్తారు. మంచి పంటలు పండినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పోటీలను నిర్వహిస్తారు. జల్లికట్టు అనంతరం దేవాలయాల్లో పూజలు నిర్వహించి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. 2017లో కొన్ని సవరణలు చేసి తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టను చట్టం చేసింది. ఈక్రమంలో ఆ సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జల్లికట్టుకు జంతు హింస చట్టం వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.